Followers

అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

 అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్.




విశాఖపట్నం, పెన్ పవర్ 

మార్చి 10 న జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా గెలిపించి ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని 31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల నియమావళి కి అనుగుణంగా బుధవారం వార్డులో అమ్మోరు వీధి, కనకల దిబ్బ, డాబాగార్డెన్స్,లలితా కోలని, అమరావతి లైన్, స్ప్రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.




అనంతరం వార్డు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వానపల్లి యువసేన సభ్యులతో ప్రత్యేక  సమావేశం నిర్వహించారు.    ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ మాట్లాడుతూ తాను పార్టీ పరంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు,వార్డు అభివృద్ధి పనులను గుర్తించి టీడీపీ నాయకత్వం 31 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందని గుర్తు చేస్తూ అధిష్టానంకు వార్డు ప్రజానీకం తరపున కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, వార్డు సమస్యలపై ఇప్పటికే ఓ అంచనాకు రావడం జరిగిందని తెలిపారు. 



గతంలో ఇదే వార్డు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం వార్డు అభివృద్ధికి  కృషి చేశానని పేర్కొన్నారు.   కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేష్, నాయకులు కనకరాజు, అప్పారావు,విజయ్, లోహిత్, నరేష్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.   




కార్యాలయంలో సంబరాలు:- ఉత్కంఠ వాతావరణంలో మంగళవారం రాత్రీ 10 గంటల సమయంలో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బిఫారం అందుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్డు కార్యాలయంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు నడుమ వానపల్లి రవికుమార్ అందరికీ మిఠాయిలు పంచుకొంటూ సంబరాలు చేసుకున్నారు. పలువురు వార్డు కులసంఘాల పెద్దలు కలిసి వానపల్లి కి శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...