ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు ఉపయోగించుకోవాలి.
వైద్యాధికారి డాక్టర్ రవి.
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం నాడు పగిడిపల్లి గ్రామపంచాయతి చెందిన బావోజీ తండ లో బానోతు అనిత కు రెండవ కాన్పు సుఖ ప్రసవం డాక్టర్ గుగులోతు రవి చేయడం జరిగింది తెలిపారు. ఇందులో భాగంగా 3కేజీ ల బరువు తో ఆడబిడ్డ కు జన్మనిచ్చింది అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ 16 వస్తువులతో కూడిన కేసీర్ కిట్టు ఇవ్వడం జరిగింది తెలియజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ దవాఖాన లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలను అత్యాధునిక పరికరాలతో ప్రభుత్వ దవకాన లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. అనంతరం ఆమెను 102 వాహనం లో తల్లి బిడ్డ ను ఇంటికి పంపడం జరిగింది వివరించారు. ఈ కార్యక్రమం లో ఏన్నమ్ ఎస్తర్ రాణి, ఆశ ఆరోగ్య కార్యకర్త ఉపేంద్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment