Followers

రక్త దానం, మహా దానం

 రక్త దానం, మహా దానం

వనపర్తి, పెన్పవర్

రక్త దానం మహాదానం అని ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని గోపాలపేట తహసీల్దార్ నరేందర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో జరిగిన రక్తదాన శిబిరంలో 34 మంది రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఒక దివ్యాంగుడు కూడా రక్తదానం చేయడం అభినందనీయమని తహశీల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్, ఎంపీడీవో, జడ్పిటిసి భారతి కోటేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎం.డి. అమర్, ఆర్యా నాయక్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కాశీనాథ్,  గాజుల కోదండం, కాసిం, డాక్టర్ స్రవంతి ఆరోగ్య సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...