ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి
పెన్ పవర్, మల్కాజిగిరి
గౌతం నగర్ చౌరస్తాలో కార్పోరేటర్ సునీత రాముయాదవ్ ఆద్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తూ సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విచ్చేసి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కె.సిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉందని కొనియాడరు. తెలంగాణ రాష్టంలో అబివృద్ది, సంక్షేమ పథకలతో ప్రజలకు ఎంతగానో ఉపాయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, టి.ఆర్.ఎస్ నాయకులు రాముయాదవ్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, ఉపేందర్, శ్రీనివాస్, అరుణ్, సిద్దిరామ్ములు, రాందాస్, మోహన్ రాజ్, సిరిగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment