లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్మశానవాటిక నిర్మాణం
తాండూర్, పెన్ పవర్తాండూరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం తాండూర్ పెద్ద చెరువు వద్ద స్మశానవాటిక పనులు ప్రారంభించారు. తాండూర్ గ్రామానికి స్మశాన వాటిక అందుబాటులో లేకపోవడం వల్ల తాండూర్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్మశానవాటిక నిర్మాణాన్ని చేపడుతున్నట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులుసురభి ఆగమ రావు తెలిపారు. స్థానిక నాయకులు యువకులు స్మశాన వాటిక నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బానయ్య ,ఎంపిటిసి సిరంగి శంకర్ తాండూర్ సర్పంచ్ననవీన్ , లైన్స్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మద్దికుంట చందు సభ్యులు గాజుల రమేష్. సుభాష్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment