Followers

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

 కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్...

ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి..

వేములవాడ, పెన్ పవర్

ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే వారిని ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వేములవాడ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పేర్కొన్నారు . వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులను మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ కి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి తరలివెళ్లే క్రమంలో అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు .కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటున్నారని.. స్థానిక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  తెలంగాణ కోసం పార్లమెంట్లో ప్రాణాలకు తెగించి కొట్లాడింది యావత్ ప్రపంచం చూసినది మీరు చూడకపోవడం విడ్డూరంగా ఉన్నదని,   ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముప్పై రెండు ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ  కాదా... పట్టణంలో రెండు బైపాస్ రోడ్లు చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.   దేవస్థానానికి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తా అని రాజన్నకు శఠగోపం పెట్టింది టిఆర్ఎస్ పార్టీ కాదా అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని పట్టణ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి అన్నారు.ఈ కార్యక్రమంలో మోడీకే చంద్రశేఖర్, అరుణ్ తేజ, ఆచార్య, కొనకళ్ల రాజు, కూరగాయల కొమురయ్య, నాగుల రాము గౌడ్, వస్తా కృష్ణ, రఘు, పరశురాం ఇటిక్యాల లింగయ్య, శ్రీకాంత్, మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...