Followers

అడిగే వారెవరు..? అంతా నా ఇష్టం..!

 అడిగే వారెవరు..? అంతా నా ఇష్టం..!

*చిన్నగూడూరు పంచాయతీ కార్యదర్శి నిర్వాకం

*విధుల్లో నిర్లక్ష్యం కానరాని చిత్తశుద్ధి

*ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని ప్రజల అనుమానం

చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రము లో పనిచేస్తున్న పంచాయితీ కార్యదర్శి అజీమ్ రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తుంది.అంతా నా ఇష్టం అడిగే వారెవరు అని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనీ వాపోతున్నారు.ఇతనికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని మండల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. లేదంటే ఇతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వాదన సర్వత్ర వ్యక్తమవుతోంది. దీని పై స్థానిక మండల ప్రజలు శుక్రవారం నాడు చిన్న గూడూరు మండల ఎంపిడివో సరస్వతి నీ కలిసి పంచాయితీ సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.మండల కేంద్రంలో రెండవ.మరియూ నాలుగవ వార్డు లలో మంచినీటి సరఫరా సరిగా చేయటం లేదనీ గ్రామంలో తమ వీధులలో స్వచ్ఛందంగా మొక్కలను తామే తెచ్చుకొని నాటుకున్నమని వాటికి కనీసం నీటి సరఫరా చేయకుండా వదిలేస్తున్నారు అని ఇంకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో నాటిన చెట్లకు నీరు లేక ఎండిపోతున్నాయని పిర్యాదు లో పేర్కొన్నారు.ఇటీవల ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది ఉన్న మొక్కలకి ఆదరణ లేక కనుమరుగై పోయె పరిస్థితులు నెలకొన్నాయి ఇక కొత్తగా నాటిన మొక్క ల పరిస్థితి ఏమిటి అని పంచాయితీ కార్యదర్శి తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు .అదేవిధంగా గేట్ వాల్వ్ కోసం తవ్విన గుంటలు వేయకుండా అలాగే వదిలేయటం తో రహదారిపై వచ్చే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మురికి నీరు నిల్వ ఉంచే చోట గేట్ వల్వ్ కోసం గుంటలు తేయటంతో మురికి నీరు అంతా లేకైన పైపుల ద్వారా మంచి నీటిలో కలుస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయితీ అభివృద్ధికి సహకరించాల్సిన పంచాయితీ సెక్రటరీ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అతనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో సూడగని నాగేష్,బాలయ్య,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...