రహదారి పనులను పర్యవేక్షించిన... ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
త్వరితగతిన పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు
ఆదిలాబాద్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కల గూడ తో పాటు దానికి ఆనుకుని ఉన్న కాలనీలలో రహదారి నిర్మాణ పనులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పరిశీలించారు. రహదారుల గుండా ఉన్న విద్యుత్ స్తంభాల కారణంగా నిర్మాణ పనులలో జాప్యం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులకు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను చూపించి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, విద్యుత్ ఎస్.ఈ ఉత్తం జాడే, నాయకులూ పండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment