ఖమ్మంలో బంద్ సక్సెస్..
కదలని బస్సులు..తెరుచుకోని వ్యాపార సముదాయాలు..
విపక్షాల ఆందోళన..తెల్లవారుజామునే డిపోవద్దకు చేరి బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులు..
ఖమ్మం, పెన్ పవర్
సాగుచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం పట్టణంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగింది. ఖమ్మం , మధిర సహా ఆర్టీ బస్సులు బస్టాండ్లు, బడిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.వామపక్షాలతో పాటు కాంగ్రెస్, టీడీపీలు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బస్టాండ్ సెంటర్ లో జరిగిన సభలో సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు పరిగణలోకి తీసుకొని మోడీ సర్కార్ సాగుచట్టాలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం పెంచడానికే సాగుచట్టాలని చెబుతున్న ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల మెప్పుకోసమే చట్టాలను తెచ్చిందన వాస్తవాన్ని దాచిపెడుతుందన్నారు.. సాగు చట్టాలు అమలైన చోట్ల చిన్న, సన్నకారు రైతులు సహా పెద్ద రైతులు కూడా వ్యవసాయ కూలీలుగా మారారని అన్నారు.. భారతదేశంలో కూడా అదే పరిస్థితులు తీసుకొచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.. స్వేచ్ఛా మార్కెట్లను తయారు చేయడం వ్యవసాయ మార్కెట్లను రద్దుచేయడమంటే దోపిడి వ్యవస్థకు అనధికార లైసెన్స్ ఇవ్వడమేనని హేమంతరావు తెలిపారు. ఇప్పటికే దేశంలో సాగుచట్టాల రద్దు సంబంధించి జరుగుతున్న ఆందోళనకు రోజురోజుకు మద్దతు పెరుగుతుందన్నారు. రద్దు తప్ప మోడీకి మరో ప్రత్యామ్నాయం లేదని హేమంతరావు స్పష్టంచేశారు. నిత్యావసరవస్తువుల ధరల ను నియంత్రించడంలో మోడీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.. మీరు మారకుంటే ప్రజలే మారుస్తారు.. పోతినేని.. సాగుచట్టాల విషయంలో ప్రభుత్వ వైకరి మారాలని, లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వాన్ని మారుస్తారని సి.పి.ఎం.రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హెచ్చరించారు. మోడీ కార్పోరేట్ సంస్థల ఏజెంట్ గా పనిచేస్తున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే మోడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. విద్యుత్ సంస్కరణ చట్టాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నూతన సాగు చట్టాలు వీటన్నింటి వెనుక దేశంలోని కార్పోరేట్ శక్తులున్నాయని ఈ విషయం ప్రజలు గ్రహించారని సుదర్శన్ రావు వివరించారు.. ఈ పోరాటాన్ని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రైవేటీకరణను వేగవంతం చేసిన మోడీ, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రలో బాగమేనని అన్నారు.. కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగునర్సింహారావు, ఎస్.కె.జానిమియా, బి.జి.క్లెమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, సి. హెచ్. సీతామహాలక్ష్మి, తాటి వెంకటేశ్వరరావు, గాదె లక్ష్మినారాయణ, చామకూరి వెంకన్న, వై.సాంబశివరెడ్డి, మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ, ఎస్.కె.జాకీర్, బోడా వీరన్న, సి.ఐ.టి.యు. రాష్ట్ర నాయకులు ఎన్.సాయిబాబా, సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి నూన్నా నాగేశ్వరరావు రావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, యర్రా శ్రీను, వై. విక్రమ్, కల్యాణం వెంకటేశ్వరావు,మాదినేని రమేష్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, కె.రామయ్య, శిరోమణి,కాంగ్రెస్ నాయకులు బాలగంగాదర్ తిలక్, దీపక్ చౌదరి, కొత్త సీతారాములు, పాషా, ఏఐటీయుసీ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు నల్లమల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment