Followers

ప్రపంచ జల దినోత్సవ భూమి పూజ కార్యక్రమం లో (సేవ్ వాటర్) నినాదంతో ప్రమాణం చేస్తున్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్

 ప్రపంచ జల దినోత్సవ భూమి పూజ కార్యక్రమం లో  (సేవ్ వాటర్) నినాదంతో ప్రమాణం చేస్తున్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్

అరకు,పెన్ పవర్

అరకువేలి మండలం చినలబుడు పంచాయతీ మాలివలస గ్రామానికి చెందిన టోంటపోధ ప్రాంగణంలో మాలసింగారం మాలివలస గ్రామ యువతీ యువకులు మహిళలు రైతులు పెద్దలు ప్రజలందరు కలిసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పనులు చేస్తుండగా,  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్, చినలబుడు గ్రామపంచాయతీ సర్పంచ్  బురిడి ఉపేంద్ర, ఆధ్వర్యంలో వారికి ప్రపంచ జల దినోత్సవం ప్రత్యేకతలు వివరించడం జరిగింది, వారి మధ్య ప్రపంచ జల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా పంచాయితీ సర్పంచ్  బురిడి ఉపేంద్ర భూమి పూజ చేయగా అక్కడున్న గ్రామ ప్రజలందరి చేత "సేవ్ వాటర్" నినాదంతో నీటిని పరిరక్షించాలి  అంటూ ప్రమాణం చేయించడం జరిగిందఈ సందర్భంగా మొస్య ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రపంచ జల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ జీవం నీటితో మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవవైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. అందుకే మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, ‘పర్యావరణం, ప్రగతి’ అనే అంశంపై బ్రెజిల్‌లోని రియో డి జనీరియో వేదికగా 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ప్రతీ ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది ‘Leaving no one behind’ నినాదాన్ని ఐరాస ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కావున ఈరోజు జరుపుకుంటున్న ప్రపంచ జల దినోత్సవం ఆదర్శంగా తీసుకుని నీటిని నిల్వ చేస్తూ నీరు కలుషితం అవకుండా పర్యావరణం పై  బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వాలంటీర్లు ఎం అర్జున్ ఎం సుహాసిని ఎం మిస్సియమ్మ ఎన్ఆర్ఈజీఎస్ టీ.ఎ జయ వి.ఆర్.పి ఎం ముక్తా, కోగేశ్వరరావు లింగ కిలో చోయితో, లోక్కోయి లక్ష్మణరావు గరం పూర్ణ  గ్రామ ప్రజలు మహిళలు యువత తదితరులు పాల్గొనడం జరిగింది,

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...