Followers

వసతి గృహలలో గర్భిణీలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

వసతి గృహలలో గర్భిణీలకు  ఎటువంటి  అసౌకర్యం కలగకూడదు

సమయానికి వైద్యం, పోషక్ విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు

ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

సాలూరు,పెన్ పవర్

 గర్భిణీ వసతి గృహంలో గర్భిణీలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలి అని ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్ట్ అధికారి సాలూరు వై.టి.సి లో నిర్వహిస్తున్న గర్భిణీ వసతి గృహాన్ని సందర్శించారు. గర్భిణీ వసతి గృహంలో నున్న గర్భిణీలతో వసతి గృహంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి సమయానికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నారా, మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందజేస్తున్నారా, అందిస్తున్న ఆహారం రుచిగా ఉంటుందా అన్న వివరాల పై ఆరా తీశారు.   మహిళలు మాట్లాడుతూ త్రాగు నీరు, వాడుక నీరు అందటం లేదని అందించమని కోరగా వెంటనే ప్రాజెక్ట్ అధికారి వై.టి.సి మేనేజర్ వెంటనే చర్యలు చేపట్టాలని ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు, సాలూరు తహశీల్దార్ పర్యవేక్షించాలని తెలిపారు. ఈ పర్యటనలో సాలూరు తహసిల్డ్ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, వై.టి.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...