Followers

పూలజీబాబా ధ్యాన కేంద్రం ప్రారంభం

 పూలజీబాబా ధ్యాన కేంద్రం ప్రారంభం


ఇంద్రవెల్లి , పెన్ పవర్ 

ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ పరమహంస సద్గురు పులాజి బాబా నూతన ధ్యానమందిరాన్ని ఇంద్రవెల్లి ఎంపీపీ పోటే శోభ, ఫూలాజి బాబా సతిమణి ఇంగ్లే గురుమాయి, కుమారుడు ఇంగ్లే కేశవ్ లతో కలసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ పోటే శోభ మరియు పులాజిబాబా కుమారుడు ఇంగ్లె కేశవ్ లు మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాల నుండి విముక్తి చెంది మంచి మార్గంలో నడిపించేందుకు ధ్యాన మందిరాలను ఏర్పాటు చేస్తూ పులాజి బాబా ఎంతో కృషి చేశారని,నేడు దస్నాపూర్ లో నూతన ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అందరూ ధ్యాన మార్గంలో పులాజి బాబా చెప్పిన మాటలను వారి సూచనలను పాటిస్తూ మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫూలాజి బాబా సతీమణి గురుమాయి, ఫూలాజీ బాబా పుత్రుడు ఇంగ్లే కేశవ్ వారితో పాటు మాజీ ఎంపి రాథోడ్ రమేష్, స్థానిక సర్పంచ్ జవాదే పార్వతి బాయి, స్థానికులు పొటే సాయినాథ్, ఆంధ్ ఆదివాసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కూడే కైలాస్, జిల్లా అధ్యక్షులు ముఖడే విష్ణు, కార్యదర్శి కరాడే మారుతి, గ్రామ పటెల్ పుండలిక్, నాయకులు దిలీప్ మోరే, కేశవ్, ప్రకాష్ ఘన్ శ్యామ్ శేషేరావు, పాండురంగ్, వెంకటి,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...