Followers

ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో నిరసన

 ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో నిరసన

ఆదిలాబాద్, పెన్ పవర్



ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి సహకార సంఘం సిఇఓ ఆత్మహత్యకు నిరసినగా ఒక్కరోజు కార్యలయం బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ధరమ్ సింగ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆత్మహత్యకు కారకులైన చైర్మన్ ను వెంటనే తొలిగించాలని వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మక్బల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ సునిల్, సిబ్బంది లక్ష్మణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...