తాడేపల్లిగూడెంలో విశాఖ ఉక్కు బందు విజయవంతం..
పెన్ పవర్,తాడేపల్లిగూడెం
విశాఖఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ ఐక్య పోరాటం కొనసాగిస్తామని వివిధ కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు పట్టణంలో బందు విజయవంతం అయ్యింది. కార్మికులు వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్టీసిడిపో వద్ద జరిగిన బహిరంగసభలో నాయకులు మాట్లాడారు.ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమ సుందర్ మాట్లాడుతూ విశాఖఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజుజరిగిన బందుకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతుఇచ్చారని, దీన్ని చూసయినా రాష్ట్రప్రజల మనోభావాల్ని కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న సమ్మెకుకూడా కార్మిక సంఘాలు పూర్తిగామద్దతు ఇస్తున్నాయన్నారు.సి.ఐ.టి.యు. జిల్లాకార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యంతవిలువైన విశాఖస్టీల్ ఫ్యాక్టరీసంపదను దక్షిణకొరియా పొస్కో సంస్థకి కారుచవకగా కట్టబెట్టాలన్న మోదీప్రభుత్వ దుర్మార్గచర్యను ప్రజలు ప్రతిఘటిస్తారన్నారు.కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం మొదలయ్యిందన్నారు.నేటి బంద్ విజయవంతం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు.తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వలవలబాబ్జీ మాట్లాడుతూ విశాఖఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్రమంత్రి పార్లమెంటులోనే వెల్లడించారని గుర్తుచేశారు.విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయడం లేదన్నారు.రాష్ట్రవిభజన హామీలనన్ని కేంద్రం తుంగలోకి తొక్కిందని, దానికితోడు విశాఖఉక్కును ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని బాబ్జీ పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు,కార్మికసంఘాలు చేపట్టిన పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తిమద్దతు ఇస్తున్నదన్నారు.ఐ.ఎఫ్.టి.యు. జిల్లా కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ రైల్వేలు, బ్యాంకులు, గనులు, బీమా, వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలన్నారు. జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాదచౌదరి మాట్లాడుతూ విశాఖఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకుకూడా విస్తరింప చేస్తున్నామన్నారు.విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణకమిటీ ఇచ్చినపిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో శుక్రవారం బంద్ పూర్తిగా విజయవంతంఅయ్యింది. ఏ.ఐ.టి.యు.సి., సి.ఐ.టి.యు., ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ కార్మిక సంఘాలసభ్యులు,బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటీ, తెలుగుదేశం,సి.పి. ఐ., సి.పి.ఎం., సి.పి.ఐ. ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున బందులో పాల్గొన్నారు.దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, హోటళ్ళు, విద్యాసంస్థలు, స్వచ్ఛందంగా మూతపడ్డాయి.కార్మికసంఘాల కార్యకర్తలు దళాలుగా తిరుగుతూ పట్టణంలోని ప్రభుత్వరంగ, ప్రైవేట్, సహకారబ్యాంక్ శాఖలను మూయించారు.దాంతో బ్యాంకింగ్ కార్యకలాపాలుపూర్తిగా స్తంభించి పోయాయి.పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా కార్యకర్తలు మూయించారు.ఆర్టీసిసంస్థ నిలిపివేయడంతో మధ్యాహ్నంవరకూ బస్సులు తిరగలేదు.
భారీ ర్యాలీ:
బందులోపాల్గొన్న వివిధ కార్మిక సంఘాల, రాజకీయపార్టీల కార్యకర్తలు జయలక్ష్మిధియేటర్ నుండి భారీర్యాలీ నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డిమార్కెట్, ఓవర్ బ్రిడ్జి, ఎన్.టి.ఆర్.చౌక్, తాలూకా ఆఫీస్ సెంటర్ మీదుగా ర్యాలీ ఆర్టీసి డిపోవద్దకు చేరింది. కార్యక్రమంలో బ్యాంకుఉద్యోగుల సమన్వయకమిటీ నాయకులు ఎస్.ఎస్.ప్రసాద్, సిద్దాబత్తుల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వలవల బాబ్జీ, పాతూరి రాంప్రసాదచౌదరి, కిలపర్తి వెంకట్రావు, దాసరిఅప్పన్న, పోతుల అన్నవరం, ముత్యాల సత్యనారాయణ,పాలూరి వేంకటేశ్వరరావు, నల్లమిల్లి చిన గోపిరెడ్డి, ఎఐటియుసి నాయకులు డి.సోమసుందర్, ఓసూరివీర్రాజు, తాడికొండ శ్రీనివాసరావు, పాలూరి లక్ష్మణరావు, పడాలశ్రీనివాస్, పోలి రాతి ఆదినారాయణ, కే.ముత్యం, ఏడిదనానీ, మండేల్లిఅంజి, ఎర్రగోగులవీర్రాజు, గోకానాగరాజు, అర్జున,మాదాసుసత్యనారాయణ, ఆంజనేయులు, కే.నాగరాజు, బి.శ్రీనివాసు, కర్రి వీరవెంకట సత్యనారాయణ, అంగిన శ్రీనివాస్, అప్పలరాజు, సి.ఐ.టి.యు. నాయకులు సిరపురపురంగారావు, కరెడ్లరామకృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పందల సన్యాసి రావు, మడకరాజు, ధనాల వెంకట్రావు, జగ్గునిరంజన రామారావు, ఐ.ఎఫ్.టి.యు. నాయకులు మామిడి దానవర ప్రసాద్, ఆర్.ప్రసాద్, టి.నాగేశ్వర రావు, డి.నాగేశ్వరరావు, సి.పి.ఐ.నాయకులు మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment