సీసీ కెమెరాలు ఏర్పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం...
పెన్ పవర్,వలేటివారిపాలెం
వలేటివారిపాలెం పంచాయతీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.ఈ నిఘా నేత్రాల ద్వారా నేరాలను అరికట్టేందుకు సులభంగా ఉంటుందని చెప్పారు. సాంకేతికంగా పలు కేసులను చేదించే దశలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ జాతీయ అవార్డు చేజిక్కించుకుందని అన్నారు. నేరస్తుల కదలికలను సులభతరంగా తెలుసుకునేందుకు, కేసును త్వరితగతిన ఛేదించేందుకు మన చేతుల్లో మన భద్రత అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో చేపట్టినట్లు ఆయన చెప్పారు.ఇప్పటివరకు కందుకూరు పట్టణం లో 45 సిసి కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ఎస్ ఐ చావా హజారత్తయ్య మాట్లాడుతూ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు సిసి కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం జరుగుతుందని తెలిపారు. కోటా వెంకటేశ్వర్లు 30,000, చుండూరి మదన్మోహన్ 25,000 , రూపినేని వెంకటేశ్వర్లు 25,000 రూపాయలు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు అందజేయడం జరుగుతుంది తెలిపారు.
No comments:
Post a Comment