Followers

శ్రీనివాస్ మరణానికి బాధ్యులైన ఇసుక రిచ్ కాంట్రాక్టర్ పై, అధికారుల పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి

 శ్రీనివాస్ మరణానికి బాధ్యులైన ఇసుక రిచ్ కాంట్రాక్టర్ పై, అధికారుల పై ఎస్సి, ఎస్టీ  అట్రాసిటీ కేసు పెట్టాలి,

బాధిత కుటుంబానికి కోటి రూపాయిల నష్ట పరిహారం ఇవ్వాలి.

కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

కెవిపిఎస్, సిఐటియు సంఘాల డిమాండ్

మంచిర్యాల,  పెన్ పవర్

దళితుడైన సంకే శ్రీనివాస్ మరణానికి బాధ్యులైన ఇసుక రీచ్ కాంట్రాక్ట్ పై అధికారుల పై  ఎస్సీ ఎస్టీ అట్టర్ సిటీ కేసు పెట్టాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కెవిపిఎస్ సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్, డీసీపీ, ఎమ్మార్వో లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ, మార్చి 13న కుటుంబ సమేతంగా గోదారి స్నానానికి వెళ్లిన సంకే శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటి గుంటలో చిక్కుకొని చనిపోవడం జరిగిందని, దళితుడైన శ్రీనివాస్ మరణించాడని ఇసుక రిచ్ కాంట్రాక్టర్, జాతర నిర్వకుల, అధికారుల నిర్లక్ష్యమే కారణంమని మల్లన సాగర్ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తన అక్రమ సంపాదన కోసం భారీ లోతుతో ఇసుకను తీసి తరలించడం వల్ల పెద్ద పెద్ద గుంతలేర్పాడి ప్రమాదకరమైన ప్రాంతంగా ఏర్పడ్డప్పటికి అక్కడ  కనీసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలెయ్యడం జరిగిందని అన్నారు. జాతరకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని, గోదారి ప్రాంతంలో స్నానాలు చేస్తారని తెలిసినప్పటికీ, ఇసుక రిచ్ ప్రాంతానికి వెళ్లే రహదారి మూసి వెయ్యడం కానీ, హెచ్చరిక బోర్డులు కానీ,  గజ ఇతగాళ్లను ఈ ప్రాంతంలో పెట్టడం జరగలేదని, జాతరకు వచ్చే ప్రజల నుండి ఆదాయాన్ని సమకూర్చు కోవడానికిచ్చిన ప్రాధాన్యత ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయారని, ఇసుక కాంట్రాక్టర్, జాతర నిర్వాకుల,అధికారుల నిర్లక్ష్యమే  ఒక్క దళిత కుటుంబానికి  అన్యాయం జరిగిందని శ్రీనివాస్ మరణించగా కుటుంబ సభ్యులందరు శోక సంద్రంలో ఉన్నప్పటికీ 8 రోజులు గడిచిపోతున్నాయని ఎ ఒక్క అధికారి, ప్రజ ప్రతినిధి కూడ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చక పోవడం శోచనీయం అన్నారు. ఇంక ఎంత మంది చనిపోతే స్పందిస్తారాని కెవిపిఎస్, సిఐటియు ప్రశ్నించారు. తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధ్యులైన వారిపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయి నష్టపరిహారం ఇవ్వలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ సంఘం నాయకులు గోడిసెల చంద్ర మొగిలి, జిల్లా అధ్యక్షులు డుర్క్ మోహన్, సిఐటియు జిల్లా కార్యదర్శి గుళ్ల బాలాజీ, నాయకులు ఎంజల కుమార్, వెల్డంది శ్యాం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...