Followers

రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం..

 రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్


దళితులు, మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద రాజాసింగ్ శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర రాజాసింగ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్బంగా దళిత ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా వున్న రాజాసింగ్ ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ దిగజారి మాట్లాడాడని,దళిత, మైనార్టీ లను అవమానించేలా మాట్లాడిన రాజాసింగ్ ను వెంటనే బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.వీధి రౌడీ లా మాట్లాడిన రాజాసింగ్ క్షమాపణ చెప్పేవరకు తమ ఆత్మగౌరవ పోరాటం కొనసాగిస్తామని, ఈ నెల 9 న రాజాసింగ్ దశదిన కర్మ నిర్వహిస్తామని దళిత బహుజనులు పెద్ద సంఖ్య లో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మర్మముల మల్లేష్, ఎర్ర యాకయ్య,డప్పు రామస్వామి,కత్తుల దుర్గయ్య, కుమార్, సాలయ్య,సంగి విజయ,వంగాల పరుశరామ్, మహేందర్, దాసు,,రమేష్, అశోక్,అయోధ్య,మొండ్రాయి మల్లేష్,అంబేద్కర్,ఎర్ర సైదులు,స్వామి ఎర్ర నాగేష్, డప్పు మల్లేష్,అనిల్, ముత్యాలరాజు, ఏపూరి ప్రభాకర్, ఎర్ర వీరన్న, చంద్రయ్య,ఈదుల నరేష్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...