పంచాయతీ కార్యదర్శులను డిడివో లుగా కొనసాగించాలని వినతి
పెన్ పవర్, కందుకూరు
పంచాయతీ కార్యదర్శులను డిడిఓ లుగా కొనసాగించాలని మంగళవారం ఐదుగురు ఎంపీడీవోల సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి న్యాయసమ్మతమైన మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపిస్తానని హామీ ఇచ్చారు. జీవో ఇచ్చినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు బాగా పని చేస్తుంటే ప్రభుత్వం పునరాలోచిస్తుందని అన్నారు. అనంతరం ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ నవరత్నాలు అమలు గడపగడపకు ప్రభుత్వ సేవలు నినాదంతో జీవో నెంబర్ 104 ,110 ద్వారా అమలులోకి వచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ తక్కువ కాలంలోనే ప్రపంచానికి ఆదర్శనీయ వ్యవస్థగా పనిచేస్తుందని అన్నారు.
దాదాపు 540 సేవలను అవినీతికి తావు లేకుండా పారదర్శక విధానంతో చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న తరుణంలో పంచాయతీ కార్యదర్శి నుంచి బాధ్యతలు తప్పించి విఆర్వో లకు గ్రామ సచివాలయం సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యతలు ఇవ్వడం బాధాకరమైన విషయం అని వారన్నారు. మండల కేంద్రాలకు ప్రజల వెళ్లకుండా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అవినీతికి తావు లేకుండా ప్రజలకు వారి ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు పొందే విధంగా ఈ వ్యవస్థలో స్థాపించిన ప్రథమ లక్ష్యం గమ్యం కూడా నేటి జీవో నెంబర్ 2 ద్వారా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యానికి తూట్లు పొడిచే టట్లుగా ఉందని వారు వాపోయారు. కావున ఈ విషయాలపై ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో నెంబర్ 2 రద్దు చేయాలని పంచాయతీరాజ్ వ్యవస్థ లో పంచాయతీ కార్యదర్శుల విధులను వ్యవస్థను నిజమైన గ్రామ స్వపరిపాలన నాంది పలకాలని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక స్వపరిపాలన పట్ల నమ్మకం దార్శనికత ప్రజల మంచి కోసం ఏమైనా చేయగల దక్షత కలిగిన ప్రభుత్వం పునరాలోచించి పంచాయతీ కార్యదర్శులను డిడివో లుగా కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు ఎంపీడీవోలు విజయ్ శేఖర్, రఫిక్ అహ్మద్, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, రవి కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రెసిడెంట్ సుభానీ,కార్యదర్శి గీత, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment