ఏలేశ్వరం లో భారత్ బంద్ సంపూర్ణం, విజయవంతం
ఏలేశ్వరం,పెన్ పవర్వామపక్షాల పిలుపుమేరకు శుక్రవారం ఏలేశ్వరం లో భారత్ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఏకపక్షంగా రైతులకు కీడు చేసే నూతనవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ భారత దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందస్తుగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రజలు ,కార్మికులు, కర్షకులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు బందులో పాల్గొన్నాయి.
దీంతో ఆర్టీసీ బస్సులో డిపో కే పరిమితమయ్యాయి. అన్ని వాణిజ్య వర్తక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. హోటళ్ళు, సినిమా హాల్లు మూసివేశారు. ఏలేశ్వరం పట్టణమంతా కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ప్రజలు బందుకు సహకరించడంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా అయ్యాయి. ప్రైవేటు వాహనాలు సైతం ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యక్షంగా బందులో పాల్గొనక పోయినప్పటికీ పరోక్ష మద్దతు ప్రకటించారు. దీంతో బందు సంపూర్ణం గా విజయవంతం అయింది.
No comments:
Post a Comment