Followers

విశాఖ మన్యంలో బంధు విజయవంతం...

 విశాఖ మన్యంలో బంధు విజయవంతం...



 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన

పెన్ పవర్,విశాఖపట్నం

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం చేపట్టిన బంద్ విశాఖ మన్యంలో  విజయవంతమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పంపు  కార్పొరేట్ వ్యవసాయం బిల్లులకు  వ్యతిరేకంగా  వామపక్షాలు వివిధ సంఘాలు మార్చి 5వ తేదీన  రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేసింది దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణాల్లో ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన మేరకు ఏజెన్సీలో పూర్తిస్థాయి మద్దతు లభించింది. పాడేరు అరకు చింతపల్లి ప్రాంతాల్లో బంధు  పరిపూర్ణంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం వివిధ గిరిజన సంఘాలు సమైక్యంగా ఆందోళనకు తెర తీశారు. కూడళ్ల వద్ద వాహనాలు రాకపోకలు లేకుండా రోడ్లపై బైఠాయించి నిరసన తెలియజేశారు. హుకుంపేట లో సామాన్య ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్న ప్రధాన మంత్రి మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మోడీ రాక్షస పాలన నశించాలని వారు నినాదాలు చేశారు.  పర్యాటక కేంద్రమైన  అరకులో దుకాణాలు హోటళ్లు మూయిం చారు. పాడేరు చింతపల్లి ఇతర మండలాల్లో కూడా  దుకాణాలు తెరుచుకోలేదు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగకుండా  కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బంధు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ముంచంగిపుట్టు   పెదబయలు జి.మాడుగుల  డుంబ్రిగూడ అనంతగిరి జీకే వీధి సీలేరు    మండలాల్లో కూడా   బంద్ ప్రభావం కనిపించింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...