కోదండ రామునికి అభిషేకం...
పెన్ పవర్,కందుకూరుకందుకూరు పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా జరిగే లక్ష తులసి పూజ కార్యక్రమం లో భాగంగా సోమవారం కోదండ రామునికి, ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు రాజా, పవన్ స్వాములు పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment