ఆర్థిక సహాయం అందజేత
నార్నూర్, పెన్ పవర్
మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ కుటుంబానికి రు.15 వేల ఆర్థిక సహాయాన్ని దివ్యశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధరావత్ ప్రవీణ్ నాయక్ శుక్రవారం అందజేశారు. వారి కుటుంబంలో ఐదుగురు పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతుండగా ఆడపిల్ల వివాహానికి ఫౌండేషన్ తరఫున సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యశ్రీ ఫౌండేషన్ తరఫున పేద కుటుంబాలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలను ఆదుకుంటామన్నారు. సర్పంచు రాథోడ్ రవీందర్,మాంకపూర్ సర్పంచ్ శావిందర్, గ్రామస్తులు గణేష్, శివ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment