నెల్లికుదురుమండలంలోఎక్సైజ్ శాఖ దాడులు
నూటయాబై లీటర్ల పానకం పది లీటర్ల గుడుంబా ధ్వంసం.
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురుమండలంలోని ఎర్రబెల్లి గూడెం శివారులో గల మూడు తండాలలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎస్సై జహీరుద్దీన్ తెలిపారు. మంగ్యతండ ,సౌల్లతండా,ఏల్యతండా లలో బుధవారం ఎక్సైజ్ ఎస్సై జహీరుద్దీన్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగాఎక్సైజ్ ఎస్సై మాట్లాడుతూ నూటయాబైలీటర్ల బెల్లం పానకం తో పాటు పది లీటర్ల గుడుంబా కనిపించడంతో వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు.మరో నూటయాబై కేజీల నల్లబెల్లం పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment