బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి......
పెన్ పవర్, ఆలమూరుబడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆలమూరు మండల సీఆర్పీలు అన్నారు. మండల పరిధి మడికి, చెముడులంక, జొన్నాడ గ్రామాలలో గల ఇటుకల బట్టీలు, వీధుల్లో ఖాళీగా తిరిగే బాలలు, పలు వాణిజ్య సంస్థల నందు పని చేసేవారిని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు శనివారం పిల్లల గుర్తింపు, బడిబయట ఉన్న వీధిబాలల సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా జొన్నాడలో సుమారు ఆరుగురు విద్యార్థులను బడి బయట పిల్లలను (ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిని ) గుర్తించారు. అలాగే మడికి గ్రామంలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను అదే గ్రామంలో గల సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో. సీఆర్పీలు పెద్దిరెడ్డి శ్రీనివాసు, గంటి శ్రీను, ఒప్పంద ఉపాధ్యాయులు మేడపాటి వీరలక్ష్మి, వడ్డి విజయలక్ష్మి, కె రామకృష్ణ, డిఎన్ లక్ష్మి, డి సత్యలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment