నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తామన్న ఎం.ఎల్.ఏ జోగురామన్న గారు ..
పట్టణంలోని పలు వార్డుల పరిశీలన..
ఆదిలాబాద్, పెన్ పవర్జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలపై ఎం.ఎల్.ఏ జోగురామన్న గారు సోమవారం ఆరా తీశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత పురపాలక అధికారులతో చర్చించారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ... సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు తమ వంతు బాధ్యతగా పాటు పడాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాల్లోనే చెత్తను వేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎం.ఎల్.ఏ వెంట మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ గారు, ఆయ వార్డుల కౌన్సిలర్లు, పురపాలక అధికారులు, నాయకులూ ఉన్నారు.
No comments:
Post a Comment