మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
పెన్ పవర్,విజయనగరంమహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని, మహిళా హక్కులపై ఉద్యమాలు చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టీ.జీవన్ తో టైలరింగ్ మహిళా కార్మికులతో సమావేశము జరిపిన సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి సాధించుకోవడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రక్షణ చట్టాలను అమలుకోసం ఆనాటి స్పూర్తితో మహిళలంతా ఉద్యమించాలన్నారు. వ్యామోగాములుగా, పైలెట్లుగా, డాక్టర్లు, నటీమణులుగా, అన్నిరకాల వాహన డ్రైవర్లుగా, ఉద్యోగులుగా, కార్మికురాలుగా, ఇంటి పని వారులుగా అన్ని రంగాల్లో సమాజ ఉత్పత్తి పరిణామ క్రమంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు చట్ట సభల్లో గానీ, సమాజంలో గాని, సమాన హక్కులు అవకాశాలు లేకపోవడం బూర్జువా పెట్టుబడిదారీ సమాజంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్నారు. సభల్లో మహిళలకు సగం రిజర్వేషన్లు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బానిసలుగా చూసే వికృతి బుద్ధుల నుంచి మహిళలను కాపాడాలని అన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు, ఈవ్ టీజింగ్,యాసిడ్ దాడులు సర్వసాధారణం అవుతున్న ఈ రోజుల్లో మహిళలంతా ఐక్యంగా ముక్తకంఠంతో తన హక్కుల కోసం ముందుకొచ్చి పోరాడాలని పిలుపు ఇచ్చారు. దిశ చట్టం వచ్చినప్పటికీ మహిళలకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాల పాత్ర సరియైన పదం లో నిర్వహించకపోవడం విచారించదగ్గ విషయమని,మహిళ అణిచివేతకు వ్యతిరేకముగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టీజీవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాధించుకోవడం కోసమే ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ పోరాడి సాధించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు, అలనాడు సమాజంలో మహిళలను హీనంగా చూడడం, ఓటు హక్కు లేకపోవడం, చట్టసభల్లో కనీసం ప్రాధాన్యత కల్పించక పోవడం, ప్రపంచవ్యాప్తంగా మహిళలు ముక్తకంఠంతో ఉద్యమించి రోజున సాధించుకున్నారు అన్నారు, ఇలా దినోత్సవాన్ని పూర్తిగా తీసుకొని చట్టసభల్లో రిజర్వేషన్ల ను మహిళా హక్కులను, కార్మిక హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
No comments:
Post a Comment