Followers

రేఖ పల్లి గ్రామంలో ఒంటరి మహిళా సమావేశం

 రేఖ పల్లి గ్రామంలో ఒంటరి మహిళా సమావేశం

 వి.ఆర్.పురం,పెన్ పవర్ 

వి.ఆర్.పురం మండలం రేఖ పల్లి  గ్రామంలో ఏ ఎస్ డి ఎస్  ప్రాంగణంలో నాట్వాన్ సంఘం  ఒంటరి మహిళల సమస్యల పై సమావేశం  ఏర్పాటు చేయటం జరిగింది.  ఈ సందర్భంగా సోషల్ ఆక్టివిస్టు రుక్మిణి రావు మాట్లాడుతూ ఒంటరి మహిళలకు పెన్షన్ గృహ నివాసం  కల్పించాలి. చింతూరు మండలం ఎర్రం పేట గ్రామానికి చెందిన ఒంటరి మహిళ శాంతమ్మ  ఇంటి ఆవరణలో పెంచుకున్న మొక్కలను పండ్ల మొక్కలను నరికివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంపై నాట్వాన్ సంఘం సభ్యులు అందరూ కలిసి ఆమె సమస్య పై పరిష్కారం కోసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెతో మాట్లాడడం జరిగింది.అదేవిధంగా నాట్వాన్ సంఘంలో సభ్యత్వం తీసుకున్న వారికి వారి సమస్యలపై అదేవిధంగా ప్రభుత్వ పథకాలు  రావాల్సిందిగా ఇతర సమస్యలు కూడా నాట్వాన్ సంఘం నుండి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. మరి వారు నాట్వాన్ సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి. అదే విధంగా రైతు ఉత్పత్తి పరస్పర సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి సభ్యుడు పదకొండు వందల రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బాలల హక్కుల కమిషన్ గాంధీ బాబు  నాట్వాన్ సంఘం ప్రెసిడెంట్ కన్నమ్మ, నాగమణి, వెంకట లక్ష్మి, మాజీ  సర్పంచి  జ్యోతి,  జయ , తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...