Followers

సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయి బాలికలు అప్రమత్తంగా ఉండండి

 సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయి బాలికలు అప్రమత్తంగా ఉండండి 

పెన్ పవర్,ఆలమూరు

   సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయని బాలికలు అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ హెచ్ అమరరంగేశ్వరరావు, ఎస్సై ఎస్ శివప్రసాద్ అన్నారు. ఆలమూరు మండలం చెముడులంక ఎస్ టి ఎస్ ఎమ్ ఎమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సుతోపాటు బాలికలకు మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ప్రస్తుత సమాజంలో జరిగే పరిస్థితులపై బాలికలకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే ప్రతి బాలికకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి అన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి పెద్దలు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని, అలాగే సెల్ఫోన్లలో అపరిచితులతో సంభాషణలు చేయరాదని హెచ్చరించారు. బాలికలు ఒంటరిగా ఉన్న సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే 100  నెంబర్లకు ఫోన్ చేస్తే క్షణాల్లో రక్షించ పడతారని తెలిపారు. అనంతరం ఎస్సై శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "దిశ" యాప్ ను ప్రతి మహిళ, బాలిక తమ చరవాణిల్లో డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.  చాలా మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నా,మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా  అలాగే మండలంలో ఏ ప్రాంతం నుండినైనా సరే 9440904849 నెంబరుకు ఫోన్ చేస్తే కేవలం అయిదు నిమిషాల్లో వచ్చి రక్షిస్తానని అన్నారు. మండలంలోని బాలికలతో పాటు మహిళలు ఈ నెంబరులను గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సునీల్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు న్యాయవాదులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...