నెల్లికుదురు మండల ఇంపాక్ట్ ట్రైనర్ గా "కళ్యాణి" నియామకం
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల కళ్యాణి నెల్లికుదురు మండలానికి ఇంపాక్ట్ ట్రైనర్ గా ఎంపికయ్యారు.ఈ మేరకు హైదరాబాదులో సోమవారం ఇంపాక్ట్ ఫౌండర్ అధినేత గంప నాగేశ్వరరావు నియామక పత్రాలను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ..ప్రతి ఇంటికి ఒక స్పీకర్ ఊరుకోక ట్రైనర్ ఉండేలా ఎదగాలన్నారు. ట్రైనర్ నియామకమైన పెరుమాండ్ల కళ్యాణి మాట్లాడుతూ ఇంపాక్ట్ సంస్థ నుంచి జీవన నైపుణ్యాలు వ్యక్తిత్వ వికాస ట్రైనర్ గా నియమించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. ఇది యువతకు జీవన నైపుణ్యాలను కమ్యూనికేషన్ స్కిల్ గురించి తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆందోళన జీవితం నుండి బయటపడి యువత కు కెరీర్ మీద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత సంస్థ ద్వారా ప్రపంచం లో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా భయం లేకుండా ప్రతి విషయం పై మాట్లాడానికి ఎంతోమందికి విషయాలు తెలియజేస్తున్నామని ఎందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ ట్రైనర్ ఆర్.కె.వి ప్రదీప్ శ్రీరామ్ శ్యామ్ రాథోడ్ సునీల్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment