అదిలాబాద్ రిమ్స్ అస్పత్రిలో అగ్నిప్రమాదం... పరుగులు తీసిన రోగులు
ఆదిలాబాద్, పెన్ పవర్ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంఐసీ విభాగంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చేలా రేగాయి. ఎంఐసీ విభాగంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా ఆసుపత్రిలో ఆవరణలో గందరగోళం నెలకొంది.. మంటలు వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్‌లో పరిస్థితిపై స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.మంటలకు గల కారణాలు మరియు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment