Followers

విజయవాడ వేదికగా డా. కుంభా రవి బాబు ప్రమాణ స్వీకారం

 విజయవాడ వేదికగా డా. కుంభా రవి బాబు ప్రమాణ స్వీకారం

విశాఖ పొలిటికల్,పెన్ పవర్ 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ఎస్.టి కమిషన్ చైర్మన్ గా డాక్టర్ కుంభా రవి బాబు శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రము  లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉదయం గం. 11 . 00  కు  రోడ్లు మరియు భవనములు విభాగ భవనం 1 వ అంతస్తు రూమ్ నెం. 108 నందు ఎ. పి. ఎస్.టి. కమషన్ నూతన కార్యాలయం లో భాద్యతలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం గం. 3 గంటలకు రాజ్యాంగ హక్కులు మరియు వాటి పరి రక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పాముల పుష్ప శ్రీవాణి , ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు ధర్మాన కృష్ణ దాస్ , ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖా మాత్యులు మేఖతోటి సుచరిత , హోమ్ మరియు విపత్తుల నిర్వహణ  శాఖ మంత్రి కొడాలి నాని , పౌర సరఫరాల శాఖ మంత్రి పేర్ని నాని , రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , దేవాదాయ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ , బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వి. విజయసాయి రెడ్డి , రాజ్యసబ సభ్యులు గొడ్డేటి మాధవి , సజ్జల రామ కృష్ణారెడ్డి , ప్రభుత్వ సలహాదారు మల్లాది విష్ణు , బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ , గౌరవ శాసనసభ్యులు అంబటి రాంబాబు , శెట్టి ఫాల్గుణ , మేరుగ నాగార్జున , మాజీ మంత్రి దాడి వీరభద్రరావు , గిరిజన నియోజక వర్గాల శాసన సభ్యులు పీడిక రాజన్న దొర , విశ్వరాయి కళావతి , కొత్తగుల్లి భాగలక్ష్మి , నాగులపల్లి ధన లక్ష్మి , తెల్లం బాలరాజు , మరియు ఇతర ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...