Followers

జింకలకు దాణా లేదు...నెమళ్ళకు నీరు లేదు

 జింకలకు దాణా లేదు...నెమళ్ళకు నీరు లేదు



అల్లాడుతున్న వన్యప్రాణులు

జేగురుపాడు జివికె మినీ  జూ పరిస్థితి

పెన్ పవర్,ఆలమూరు 

     దేశమంతటా వన్యప్రాణుల వారోత్సవాలు జరుగుతుంటే తిండి,నీళ్లు లేక తూ.గో.జిల్లా కడియం మండలం జేగురుపాడు జివికె పవర్ ప్రాజెక్ట్ మినీ జూ లో జింకలు,నెమళ్ళు వంటివి అల్లాడుతున్నాయి.ఈ ప్రాజెక్ట్ ఏర్పడిన మూడు దశాబ్దాల కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ జూ లో ప్రస్తుతం మరణమృదంగం మోగుతుంది.కరోనా వల్ల ఈ జూ లోకి సందర్శకులు రానీయకుండా నిలుపుదల చేసారు. అదే ఈ వన్యప్రాణులకు శాపంగా మారింది. ఖరీదైన రెండు హంసలుతో పాటు నెమళ్ళు (తెల్ల నెమలి కూడా),జింకలు, కొండచిలువలుతో పాటు అనేక అతిదైన పక్షులు, జంతువులు ఈ జూలో ఉండేవి.కాల క్రమేణ చాలా వరకూ కనుమరుగయ్యాయి. ఉన్నవాటికి సంరక్షణ లేకుండా పోయింది.

ఇటీవల కుక్క కరిచి 28 జింకలు మృతి చెందాయని నిర్వాహకులు చెబుతున్నారు. అవి ఎలా చనిపోయాయని నిర్దారించిన అధికారి ఎవరూ లేరు. ప్రస్తుతం 52 జింకలు ఈ జూలో ఉండగా వాటికి గడ్డి వేసే నాధుడు లేడు.అంతెందుకు ఈ వన్యప్రాణులకు నీరు అందించే విద్యుత్ మోటార్ మరమ్మత్తులకు వచ్చి పదిరోజులైనా బాగు చేసేవారు లేరు.దీంతో నెమళ్ళు ఇతర పక్షులు త్రాగు నీరులేక అల్లాడుతున్నాయి.ఈ జూలో వన్యప్రాణుల పరిస్థితిని జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ దృష్టికి తీసుకెళ్లడంతో అయన ఈ జూను అధికారులతో కలసి పరిశీలించారు.అటవీశాఖ అధికారులు ప్రమేయం లేకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.తక్షణమే వీటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు.ఇప్పటికైనా ఈ జూ కి పూర్వవైభవాన్ని తోసుకురావలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...