Followers

నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

 నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

మందమర్రి, పెన్ పవర్

నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని మందమర్రి మార్కెట్ లోని భగత్ సింగ్ ఏరియా యువత సభ్యులు రాయబారపు కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భగత్ సింగ్ ఏరియా యువత ఆధ్వర్యంలో మందమర్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఆరోగ్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువత సభ్యులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఓర్పుతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య రంగంలో పనిచేసే మహిళా ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నాయకురాలు పద్మ, ఫర్జానా, యువత సభ్యులు శ్రీకాంత్, అశోకరెడ్డి, జమాల్, రమేష్, సుజిత్, శ్రీకర్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...