చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి అందించాలి
కె వి పి యస్ జిల్లా నాయకులు ఇస్సంపేల్లి సైదులు
నెల్లికుదురు, పెన్ పవర్కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ఓటు బ్యాంకులాగా వాడుకోవడం తప్ప వారి జివన విదానం, భవిష్యత్తు పై అలోచించే పరిస్థితి లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు ఇస్సంపెల్లి సైదులు అన్నారు. ఆయన బుధవారం మహుబుబబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో కే వి పి ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరన చేసి నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని. ఎన్నికల ప్రచారాలలో చేసిన వాగ్దానాలు ఆచరణలో అమలు చేస్తున్న విదానాలకు ఎలాంటి పొంతనలేదని అన్నారు.సామ్రాజ్య వాదులకు బడా పెట్టుబడిదారులకు అండగా ఉండటం తప్పా పేదప్రజల కోసం అలోచించేవారు లేరని అవేదన వ్యక్తం చేశారు. యువత అనేక ఉన్నత చదువులు చదివి ఎన్నో పట్టాలు పొందిన పలితం శూన్యం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువతి యువకులు ఉపాధి అవకాశాల కోసం పొరాటాల ద్వారాసాదించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బాణాల యాకయ్య, బ్రహ్మయ్య, గణపురం ఎల్లయ్య, అశోక్, ఉప్పలయ్య, వెంకటలక్ష్మి, ఆలేటి యాకయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment