Followers

బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం

 బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం

కూకట్ పల్లి, పెన్ పవర్

మార్చి 12తారీఖున జరిగిన కూకట్ పల్లి కోర్టు ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గం బుధవారం కోర్టు ఆవరణలో బాధ్యతలు స్వీకరించారు. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శాయేశ్వరా శర్మ, ప్రధాన కార్యదర్శిగా విజయశేఖర్ బాబు, జాయింట్ సెక్రటరీగా ఆదిత్యకుమార్, కోశాధికారిగా నటరాజ్, లైబ్రరీ సెక్రెటరీగా లత, స్పోర్ట్స్ సెక్రటరీగా భీమయ్య, మహిళ సెక్రటరీగా శైలజ, కార్యవర్గ సభ్యులుగా శ్రీలత, శివప్రసాద్ గౌడ్, రాణి, సురేష్, రమేష్, కరుణ, దేవిధాస్ లు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ న్యాయవాదులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, నూతనంగా నిర్మిస్తున్న కోర్టు పనులు తొందరగా సాగేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్టు భవనంలో పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులను పలువురు అడ్వకెట్లు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...