జల సంరక్షణ - జన సంరక్షణ
పెన్ పవర్,ఆత్రేయపురం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 20 వ తేదీ నుండి పదిరోజులపాటు అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి జలవనరుల నిర్వాహణ కొరకు జలసంరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి తాహశిల్దార్ ఎం రామకృష్ణ అందరు పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని ఆదేశించారు.మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం మండల స్థాయిలో సిబ్బందికి అవగాహనా సదస్సులను, మద్యాన్నం ఆయా గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు అవగాహన సదస్సు లు నిర్వహించామని వారు తెలిపారు.
జల సంరక్షణ లో భాగంగా :గ్రామంలో మంచినీరు ఓవర్ హేడ్ టాంక్,మంచినీటి చెరువులు, వాల్వ్ చాంబర్లు శుభ్రపరుచుట, వద్ద తుప్పలు నరికించుట, గ్రామంలో పైప్ లైను లీకులు గుర్తించి రిపేర్ చేయించుట, అవసరమైన గేట్ వాల్వులు మార్చుట, గ్రామంలో అన్నిప్రాంతాలు నడిచి మంచినీటి పొదుపుపై అవగాహన శుక్రు వారం డ్రై డే పాటించుటపై అవగాహన, మంచినీటి కిట్ల వినియోగంపై అవగాహన మంచి నీటీ పరీక్షలపై ప్రాథమిక అవగాహన, గ్రామంలో వివిద ప్రాంతాలలో కుళాయిలనుండి , చెరువుల త్రాగునీటి బోరింగ్ ప౦పుల నుండి సాంపిల్స్ సేకరించి కిట్లద్వారా ఎనిమిది ప్రామాణిక అంశాలపై పరిక్షలు హెల్త్ ఇంగినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా చేయించి నీటి క్వాలిటీ పై అవగాహన పెంచుకొనుట తదితర కార్యక్రమాలను ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారి డా.శ్రీనివాసవర్మ, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ , పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment