భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా రాళ్ల బండ మహేందర్...
అదిలాబాద్ , పెన్ పవర్శుక్రవారం హైదరాబాద్ లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎ.భాను ప్రకాష్ అధ్యక్షతన ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రాళ్ల బండ మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్న సందర్భంగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బిజెపి సంఘటన మంత్రి శ్రీనివాస్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి యువమోర్చా యువకులను చైతన్యవంతులుగా చేసి, పార్టీ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు, అందిస్తానని, తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
No comments:
Post a Comment