గర్భిణి స్త్రీలకు సాముహిక శ్రీమంతం
పెన్ పవర్ , మల్కాజిగిరిమనద్వీపం గ్రూప్ మరియు గ్లోబల్ ఎంజెల్ జై చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆద్వర్యంలో మహిళా దినోత్సవం సందర్బంగా సీమంతోత్సవం మల్కాజిగిరి ఇంద్రనగర్ లో నిర్వహించారు. 50మందికి పైగ గర్భిణి స్రీలకు తెలుగింటి ఆడపడుచు సంప్రదాయ బద్దంగా సీమంతం చేశారు. మహిళాలకు గాజులు, పండ్లు, నూతన వస్రాలతో ఘనంగా సీమంతం కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా యమున ఫతక్ (తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు) మీడియాతో మాట్లాడుతూ మహిళాలు గర్భిణి సమయంలో సరియైన పోషిక ఆహరం తీసుకొలేక ఇబ్బందులు పడుతున్నావారు చాలా మంది ఉన్నారని, వారికి ఉడత భక్తిగా ప్రతి ఒక్కరూ సహయం చేయాలని అన్నారు. మల్కాజిగిరి మనద్వీపం వాట్స్ అప్ గ్రూప్ లో గర్భిణి స్రీ మహిళాలను గుర్తించి వారికి రంగ రంగ వైభవంగా సీమంతం చేశారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను పంపిణి చేసి ప్రజలను అదుకున్నారని కొనియాడరు. మహిళాలకు గర్భిణి సమయంలో బందువులతో భారీ స్దాయిలో సీమంతం జరిపించుకొలేదని ఆవేదన చెందుతారని, అలాంటి మహిళాలకు తమ వంతు సహయంగా ఉడత భక్తితో ఈ కార్యక్రమం చేశామని ఇందుకు మల్కాజిగిరి మనద్వీపం గ్రూప్ అండాగ నిలిచి సమజిక సేవలు చేస్తున్నా సభ్యులకు ఆభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ, పర్వతీ, భవాని, అమీనా తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment