ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
లక్షెట్టిపెట్, పెన్ పవర్పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగం పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో గత సంవత్సరం కంటే విద్యారంగానికి నిధులు తగ్గాయన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి విద్యారంగానికి కేటాయించే కేటాయింపులు చూస్తే విద్యారంగం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అర్ధం అవుతుందని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గనికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్,ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్,రాష్టంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ,టెక్నీకల్ యూనివర్సిటీల అభివృద్ధి, గురుకులకు స్వంత భవనాల నిర్మాణాన్ని విస్మరించాలని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ లో విద్యరంగానికి అన్యాయం జరుగుతుందని, విద్యారంగ అవసరాలకు ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని,విద్యరంగానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెపటునట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్, నరేష్,ప్రవీణ్,సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment