రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్
రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం
పెన్ పవర్, కరప
రైఫిల్ షూటింగ్ లో కరపమండలం నడకుదురు గ్రామానికి చెందిన ముమ్మిడి సాయిరాం స్వరూప్ సత్తా చాటి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో గత నెల 24 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 21వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫిల్ షూటింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ఎం.రామరాజు కు బంగారు పతకం లభించగా తనకు సిల్వర్ మెడల్ లభించినట్టు స్వరూప్ తెలిపారు. ముమ్మిడి శివసాయిరాంస్వరూప్ ఎంసీఏ చదివి ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారు. రైఫిల్ షూటింగ్ పట్ల ఉన్న అభిరుచితో ఆంధ్రప్రదేశ్ లో 2017లో సభ్యత్వం తీసుకుని ముమ్మర సాధన చేసినట్టు అతను తెలిపారు. ఈ ఏడాది పోటీల్లో పాల్గొని మొదటిసారే రెండో స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఫోన్ లో అభినందించారు. నడకుదురు మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నాయకుడు జవ్వాది సతీష్ , ఇతర గ్రామ పెద్దలు స్వరూప్ ని అభినందించారు.
No comments:
Post a Comment