పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ...
నార్నూర్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఎస్ ఐ విజయ్ కుమార్ బుధవారం ఆటో డ్రైవర్లకు ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున నేపత్యంలో డ్రైవర్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాల దూరాన్నీ పాటించాలని,డ్రైవర్లు బయటి ప్రదేశంలో ఆటోలు నడిపేటప్పుడు ప్రయాణికులకు ఆటోలో కూర్చునప్పుడు జాగ్రత్తలు వివరించి చేతికి శానిటైజర్ చేసి మాస్కులు ధరించాలని తగు సూచనలు పాటించి జాగ్రతలో ఉండాలని ఆదేశించారు. వారి వెంట యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, ట్రైనీ ఎసై, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment