రావులపాలెం లో బంద్ పాక్షికం
పెన్ పవర్,రావులపాలెం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శుక్రవారం బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్ల పైకి రాలేదు. డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే రావులపాలెం బస్ స్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. అయితే రావులపాలెం, కొత్తపేటల్లో వ్యాపార సంస్థలు మాత్రం యధావిధిగా తెరుచుకున్నాయి. దీంతో బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది.
No comments:
Post a Comment