నిబద్ధత కలిగిన నాయకుడు వేమా యల్లయ్య
పెన్ పవర్,సంతనూతలపాడుఅట్టడుగు స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన....దివంగత మాజీ ఎమ్మెల్యే వేమా యల్లయ్య గారు పార్టీకి విధేయతకు కట్టుబడి ఉండి నిబద్ధత కలిగిన నాయకుడిగా ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారని ఎమ్మెల్యే టీ.జే.ఆర్ సుధాకర్ బాబు అన్నారు. చీమకుర్తి లో ని వేమా ఎల్లయ్య మెమోరియల్ భవన్ వద్ద బుధవారం జరిగిన యల్లయ్యగారి 25వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దాసరి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఆయన ముద్ర వేసుకున్నారని దీనికి నిదర్శనం చేసే పనిలో చిత్తశుద్ధిగా వ్యవహరించి నీతి నిజాయితీ కలిగి ఉండటమే క్రింది స్థాయినుంచి అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు. ముందుగా వేమ ఎల్లయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఎల్లయ్య చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ బి జవహర్, కృష్టపాటి వెంకటేశ్వర రెడ్డి, శేఖర్ రెడ్డి, వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ చల్లా అంకుల్, వైస్ చైర్మన్ బాపతు వెంకటరెడ్డి, కౌన్సిలర్లు కంజుల ప్రతాపరెడ్డి, తప్పెట బాబురావు, పాటిబండ్ల గంగయ్య, పాలపర్తి వెంకటరావు, తదితర కౌన్సిలర్లు, వైయస్సార్ సిపి నాయకులు పేరం శ్రీనివాసరావు, భాష, రామబ్రహ్మం, ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment