సులభ కాంప్లెక్స్ లను తక్షణమే వినియోగంలో తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్
అరకు, పెన్ పవర్
సామాజిక ప్రజా మరుగుదొడ్లు(సులభ కాంప్లెక్స్)ను తక్షణమే వినియోగంలో తీసుకురావాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పర్యాటక కేంద్రంమైన ఆంధ్ర ఊటీ అరకులోయలో పెదలబుడు గ్రామపంచాయితీ లో గల సామాజిక ప్రజా మరుగుదొడ్లను పరిశీలించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొస్య ప్రేమ్ కుమార్, నగరంలో నిర్మించి నిరుపయోగం లో ఉన్న సామాజిక ప్రజా మరుగుదొడ్లు (సులబ్ కాంప్లెక్స్)ను పరిశీలించడం జరిగింది, ఆ పిమ్మట విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన ఆంధ్ర ఊటీ అరకులోయలో నూతన సామాజిక ప్రజా మరుగుదొడ్లను (సులబ్ కాంప్లెక్స్) ను నిర్మించక పోగా గతంలో సుమారు 20,00000 (ఇరవై లక్షల రూపాయల)తో నిర్మించిన సులభ కాంప్లెక్స్ ఇక్కడ స్థానిక ప్రజలకు పర్యటకులకు సౌకర్యవంతంగా అందుబాటులో తీసుకురాక పోగా అది నిర్మించిన నాటినుండి మూతపడి నేటికీ సుమారు రెండు సంవత్సరాలు అవుతున్న, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు, ఇది అలంకర ప్రాయంగానే ఉంచి నూతన సులభ కాంప్లెక్స్ ను నిర్మించక పోవడం చాలా బాధాకరం అని అన్నారు, ఇది వినియోగంలో లేకపోవడం వలన శుక్రవారం సంతలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుండి వచ్చే ఆదివాసి మహిళలు పక్కనే ఉన్న తాసిల్దార్ ఆఫీస్ కి వచ్చే స్థానిక ప్రజలు, దూర ప్రాంతాల నుండి అరకులోయ ను తిలకించడానికి గిరిజన మ్యూజియం కి వచ్చే పర్యాటకులు గిరిజన మహిళలు వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు అని అన్నారు, ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజలకు కనీసం సులభ కాంప్లెక్స్ ను కూడా సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులో తీసుకు రాకపోవడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు, మరియు అరకులోయ పట్టణంలో త్రాగు మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం చాలా దారుణం అని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి అరకువేలి సులభ కాంప్లెక్స్ ను ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో తక్షణమే వినియోగంలో తీసుకు రావాల్సిందిగా రాబోయే రోజుల్లో మరెన్నో సులభ కాంప్లెక్స్ ను నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో లో స్థానిక ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment