మెరుగైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం..
జగద్గిరి గుట్టలో70 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...
కుత్బుల్లాపూర్, పెన్ పవర్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద 70 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment