భక్తులకు నిరాశే....
నిరాడంబరంగా నిర్వహించనున్న రాజన్న కళ్యాణం
ఆంతరంగికంగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు
వేములవాడ, పెన్ పవర్కరోనా నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవ వేడుకలను ఆలయ అధికారులు నిరాడంబంరం గా నిర్వహించనున్నారు. భక్తులేవరినీ కూడా శివ కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు అనుమతించడం లేదు.కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులకు అనుమతి లేదు. ఈవో కృష్ణ ప్రసాద్
మహమ్మారి దృష్ట్యా భక్తులెవరిని కూడా శివ కల్యాణాన్ని వీక్షించడానికి ... పాల్గొనడానికి అనుమతించడం లేదన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని... భక్తులు అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలన్ని ఆంతరంగికంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment