Followers

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

పెన్ పవర్,పొన్నలూరు 

పొన్నలూరు గ్రామానికి చెందిన వాకాని వేణు గోపాలా చార్యులు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నెల్లూరు హాస్పిటల్ కి కారులో వెళుతుండగా కొడవలూరు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను డికొట్టి ప్రక్క రోడ్డు పైకి దూసుకెళ్లింది.ఎదురుగా వస్తున్న ఇంద్ర బస్సు ఆ కారును డీ కొనడంతో పూజారి వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించాడు.వేణు గోపాలా చార్యులు పొన్నలూరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో పూజరిగాను ,కందుకూరు పామూరు రోడ్డు నందు ఉన్న రామాలయానికి పూజారి గాను పనిచేస్తున్నారు. అను నిత్యం అందరితో కలిసి మెలసి మంచిగా ఉండే వేణు గోపాలా చార్యులు మృతి చెందడంతో పొన్నలూరు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.గ్రామ ప్రజలు ,వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.ఇతని తో పాటు ఆ వాహనంలో గ్రామంలోని మరొక పూజారి మణికంఠ ,సుధాకర్ ,డ్రైవర్ వెంకటేశ్వర్లు లకు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.పోలీస్ వారు కేసు నమోదు చేసి ప్రమాదానికి జరిగిన కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...