వామపక్షాల పిలుపుమేరకు బంద్ విజయవంతం
కేంద్ర ప్రభుత్వా మొండి వైఖరికి నిరసనగా
పెన్ పవర్,కూనవరం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును పెట్టుబడి దారులకు ధనా దత్తం చేయడానికి నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వా వ్యతిరేక విధానానికి నిరసనగా వామపక్షాల పిలుపుమేరకు శనివారం నాడు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన టేకులబోర్ సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించగా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, కాలేజీలు స్వచ్ఛందంగా పాల్గొని బందును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరంi పెంటయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం ఉద్యమంలో భాగస్వాములై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఓకే నినాదంతో ఉద్యమం ఎగిసిపడుతోందని పెడుతుందని, ఉక్కు ను పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి సీనియర్ నాయకులు ఎడవల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని విమర్శించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడంనికి రాష్ట్ర ప్రజల హక్కు పెట్టుబడిదారులకు దాన దత్తం చేస్తే ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని హెచ్చరించారు. ఇకనైనా ప్రైవేటీకరణను విరమింప చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాయం సీతారామయ్య సిఐటియు, శ్యామల కృష్ణ వ్యవసాయ కార్య సంఘం, కాంగ్రెస్ నాయకులు బత్తుల నరసింహారావు, జనసేన పార్టీ నాయకులు బండారు సాంబశివరావు, హేమంత్, టిడిపి నాయకులు ప్రకాష్ రావు, సిపిఐ నాయకులు తాలూరు శ్రీనివాసరావు, తలగాని నాగరాజు, బి ప్రసాద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment