Followers

ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ

 ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ

- అభినందించిన ఎమ్మెల్యే గణేష్ 

నర్సీపట్నం,  పెన్ పవర్

నర్సీపట్నం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్,  వైస్ చైర్మన్ లు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తమ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, వైసిపి నాయకులు గుడబండి నాగేశ్వరరావు, శెట్టి మోహన్ లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.  ముహూర్తం ప్రకారం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహమూర్తి తన అనుచరగణంతో ర్యాలీగా కార్యాలయానికి చేరుకొని గం.11-15 ని.లకు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఇరువురికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు, వైసిపి నాయకులు,  కార్యకర్తలు బాధ్యతలు స్వీకరించిన ఆదిలక్ష్మి నరసింహమూర్తిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  మున్సిపాలిటీలో 9.26 కోట్లతో 93 పనులకు శంకుస్థాపనలు చేయనున్నామని తెలిపారు. ఏ వార్డ్ లో ఎన్ని పనులు చేస్తున్నారో వివరాలను వెల్లడించారు. ప్రత్యేకంగా 24 వ వార్డు లో పెద్ద చెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని,  ప్రస్తుతానికి కోటి రూపాయల మేర టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు.  త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. చైర్ పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామన్నారు. వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం మా తండ్రి గొలుసు నారాయణమూర్తి నర్సీపట్నం మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా పని చేశారని, తాను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...