Followers

మహిళ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన బి.జి.ఆర్...

 మహిళ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన బి.జి.ఆర్...

 ఆదిలాబాద్ , పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం  మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో భాగంగానే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన  ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి ఊరి గోవర్ధన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని  శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాఠశాల లకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో సైతం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. పేద విద్యార్థుల చదువుతో పాటు వారికి భోజనా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి చదువుపై మరింత దృష్టి సారించేలా trs ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్,  కళాశాల ప్రిన్సిపాల్ అథిక్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ అనిత,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...